నేలపట్లలో సీపీఐ(ఎం) పోరుబాట..

CPI(M) struggle at ground level..నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో  సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ పిలుపుమేరకు పల్లె పల్లెనా పోరుబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో ప్రధానంగా మురుగు నీటిపారుదల సమస్యను గుర్తించడం జరిగింది.ప్రధానంగా ఎస్సీ కాలనీ నుండి ఈదుల వాగు  వరకు సుమారు 2 కిలోమీటర్లు మురుగు కాలువ నిర్మించినట్లయితే సుమారు గ్రామం నుండి 60 శాతం మురుగునీరు పంపించడానికి అవకాశం ఉంటుందనీ తెలిపారు. ఈరకంగా నిర్మించకపోతే పాత ఎస్సీ వాడ నుంచి భూమి పై పరచుకుంటూ మురుగనిరంతా రోడ్డుపై నుంచి పోతాఉం దానివలన పచ్చని పంట పొలాలు మురుగు మురుగు  వలన రైతులు చాలా నష్టపోతారు.  వడ్ల లింగయ్య ఇంటి వరకు గ్రామానికి సంబంధించిన మరొక మురుగు నీరు కాలువ వచ్చి ఆగింది ఆ ప్రాంతమంతా మొత్తం మురుగుమరుగు అయి దోమలు, పాముల వలన చాలా ఇబ్బంది అవుతా ఉంది అట్టి నీరును కూడా ఈదలవాకులోకి మళ్లించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. మా గ్రామం నుండి భువనగిరికి వెళ్లాలంటే ప్రధానంగా వర్కట్పల్లి సంగం గ్రామాల మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. మా గ్రామానికి రెండు నియోజకవర్గాల సరిహద్దు అనగా భువనగిరి మునుగోడు ఉండడం వల్ల ఈ సరిహద్దుల మూలంగా రెండు నియోజకవర్గాల శివారు ప్రాంతంలో ఒక కిలోమీటరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. అట్టి దానికి మరమ్మత్తులు ఏమాత్రం కూడా ఇప్పటికి కూడా చేయలేదు. అట్టి విషయంపై అధికారులు స్పందించి తొందరగా రోడ్డు మరమ్మతులు చేయించాలని, నేలపట్ల గ్రామం నుండి నక్కలగూడెం  రోడ్డును  బీటీ రోడ్డుగా మార్చాలని, జై కేసారం రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని,  ప్రధానంగా మా నేలపట్ల గ్రామానికి పెద్ద కొండూరు చిన్న కొండూరు మందోల్లగూడెం కుంట్ల గూడెం  నేలపట్ల గ్రామాల మీదుగా ఈదుల వాగు సుమారు 9 కిలోమీటర్లు పారుతూ ఉంటుంది. ఏ చిన్న వర్షం వచ్చినా నేలపట్ల గ్రామానికి వర్కటిపల్లి గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. ఎందుకు అంటే ఈదుల  వాగు పైన కలవర్టు  నిర్మించవలసింది.
దీనితోపాటు పీర్ల కొట్టము నుండి ఈదమ్మ గుడి వరకు మురుగు కాలువ వరకు ఉన్న డ్రైనేజీలో కలపవలసి ఉంది. మా గ్రామానికి ప్రధానంగా నూతనంగా ఏర్పడిన మాధవరెడ్డి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు కాబట్టి ఆ కాలనీలో అన్ని వీధులలో డ్రైనేజీ వ్యవస్థని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రధానమైన సమస్యలను ఈరోజు పల్లె పల్లె పోరుబాట యాత్రలో సీపీఐ(ఎం) పార్టీ ముఖ్య నాయకులు సమస్యలు గుర్తించారు ఈ సమస్యల పైన గ్రామ ప్రజలను చైతన్యవంతులను చేసి వారితో మమేకమై గ్రామపంచాయతీ ముందు ధర్నా నిర్వహించి తదుపరి ఆర్డిఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా నిర్వహించి సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నేలపట్ల సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం చౌటుప్పల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు తడక మోహన్, రాగిరి కిష్టయ్య మండల కమిటీ సభ్యులు పల్లె మధు కృష్ణ నేలపట్ల శాఖ కార్యదర్శి దెబ్బటి బక్కయ్య సహాయ కార్యదర్శి యనమల సంజీవ గ్రామ సీనియర్ నాయకులు బుట్టి కృష్ణ పబ్బతి పుల్లయ్య బుట్టి బాలరాజు బత్తుల వేణు కుర్లపల్లి గంగాధర్  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love