గంజాయి అమ్ముతున్న నేరగాళ్లు అరెస్ట్

– 620 గ్రాములు గంజాయి, కారు, రెండు బైకులు స్వాధీనం
నవతెలంగాణ – కోదాడరూరల్
పట్టణంలో ఆప్కారి పోలీసులు జరిపిన దాడిలో వివిధ కుడళ్ళలో గంజాయి అమ్ముతున్న నేరగాళ్లు అరెస్ట్ అయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం సమయంలో ఆఫ్కారీ సూపర్డెంట్ లక్ష్మానాయక్, ఎక్సైజ్ సీఐ ఎం శంకర్, ఎస్సైలు రామకృష్ణ, యాదయ్య, గోవర్ధన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, నాగయ్య, ఉదయ్, రాము, నరేష్ సిబ్బందితో కలిసి పట్టణంలో రైడ్ చేయగా పోలీసులు ఖమ్మం క్రాస్ రోడ్డు, బొబ్బలమ్మ గుట్ట సమీపంలో, విష్ణు రామా థియేటర్ సమీపంలో గంజాయి అమ్ముతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 620 గ్రాముల గంజాయిని , ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కోదాడ పట్టణానికి చెందిన దిగుంట్ల ఉపేందర్ ,చిన్నపంగు అభిలాష్,  షేక్ మతిన్, బి నవీన్ రెడ్డి, బెల్లంకొండ వినయ్, నవీన్ ఆరుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మిన సేవించిన చట్ట ప్రకారం నేరమని వారు సూచించారు.
Spread the love