నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి : బుధారపు శ్రీనివాస్ 

– పెద్దవంగరలో ఘనంగా బాలసభ
నవతెలంగాణ – పెద్దవంగ
విద్యార్థులు చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఎంఎన్ఓ బుధారపు శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మార్గదర్శనంలో బాలసభ ను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకను వెలికి తీయడానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి నేటి పోటీ ప్రపంచంలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని, అన్ని అంశాలపై సంపూర్ణ పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ప్రత్యేక ఆకర్షనీయంగా నిలిచాయి. అనంతరం ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ కోసం ఎంపికైన పాఠశాల విద్యార్థి తిమ్మిడి సాయికుమార్ ను ఉపాధ్యాయుల బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య ,అంజయ్య, టకీం పాషా, గౌరీ శంకర్, శ్రీధర్, షౌఖత్ అలీ, సువర్ణ, కరుణ, హైమ తదితరులు పాల్గొన్నారు.
Spread the love