నాన్న.. ది గ్రేట్

– పిల్లల ప్రతి అడుగులో అండగా నిలుస్తూ
– స్నేహితుడుగా సలహాలిస్తూ
– తన కిందకి ఒదుకుతూ.. తన పిల్లలు ఎదిగేలా చేస్తూ
– భవిష్యత్తుకు బలమైన పునాది
– రియల్ హీరోగా నిలుస్తున్న నాన్న…
నవతెలంగాణ – బొమ్మలరామారం
అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే.. నాన్న కష్టాలు రాకుండా కావాలి కాస్తాడు.. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టాన్ని గుండెలో దాచుకుంటాడు. అలుపెరుగని సైనికుడు జీవనం పోరాటం చేస్తాడు. తన అలసటను కూడా కనబడనీయకుండా బతుకు బండిని నడిపిస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. వెలకట్టలేని ప్రేమకు చిరునామా నాన్న నాన్న.. పైకి కరుకుగా కనిపిస్తున్న, నా మనసు మాత్రం వెన్న. బిడ్డ వేసే తొలి అడుగు మొదలు… ప్రతి అడుగులో నాన్న తోడుంటాడు. తనకెంత కష్టమైనా.. తను ఎంత బాధను అనుభవిస్తున్న.. పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. తన పిల్లలకు నవ్వులు పంచుతాడు.. రాత్రి ఇంటిల్లిపాది గుండెల మీదగా చేయి వేసుకొని హాయిగా నిద్రపోతారు. కానీ.. నాన్న గుండెల నిండా రేపటి ఆలోచనలే.. తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. ఏం కష్టపడతాడు.. పిల్లలు కడుపు నిండితే చాలు.. తను సగం కడుపుతోనే సంతృప్తి పడతాడు.. పిల్లలు నవ్వుల్లో వాళ్ల ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కుంటాడు.. మొదటిగా బిడ్డే ప్రయోజకుడైతె ముందుగా గర్వించేది నాన్నే .. ఎందుకంటే తన విలువైతు బిడ్డ విజయం వెనుక ఉన్నది.. మీ నాన్న అందుకే నాన్న ఓ రియల్ హీరో.. నాన్న .. అన్న పిలుపుతోనే పరవశిస్తూ తన జీవితాన్ని దారపోస్తున్న తండ్రులకు హ్యాట్సప్..

Spread the love