మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపలగూడెం రామ్ నగర్ పంచాయతీ ఎల్బీనగర్లో ఇటీవల మృతి చెందిన బొబ్బ రాములమ్మ మరియు సనప అశ్వపతి
ఇలా కుటుంబాలను బుధవారం మంత్రి సీతక్క కుమారుడు దనసరి సూర్య పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దనసరి సూర్య ముందుగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందన్న భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, ములుగు జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల జనార్దన్ రెడ్డి, సామ చిట్టిబాబు,సుడి సత్తిరెడ్డి,బొల్లు అశోక్, సమ్మలు, జనార్థన్ రెడ్డి,బోల్లు కుమార్,కందుల అశోక్ మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.