చండూరు తహసీల్దార్ గా దశరథ

– గట్టుపల్ తహసీల్దార్ గా కె.  రాములు పదవి బాధ్యతలు
నవతెలంగాణ – చండూర్ 
చండూరు తహసీల్దార్ గా జి.  దశరథ బుధవారం పదవి  బాధ్యతలు చేపట్టారు. ఈయన చిట్యాల మండలం నుండి ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో  భాగంగా   చండూరుకి వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసిల్దార్ రవీందర్ రెడ్డి   రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు.   గట్టుప్పల్ తాసిల్దారుగా కె. రాములు  పదవి బాధ్యతలు  చేపట్టారు. ఈయన చందంపేట మండలం నుండి  బదిలీపై చండూరుకు వచ్చారు. ఇక్కడి తాసిల్దార్  లావణ్య వికారాబాద్ జిల్లాకు  బదిలిపోయి వెళ్లారు. ఈ సందర్భంగా తాసిల్దార్లు మాట్లాడుతూ  మండలంలో  ఏ భూ సమస్యలు, ఉన్న తనవంతు గా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో మండలాల అభివృద్ధి దిశగా   ముందుకు వెళ్తామన్నారు.
Spread the love