టెహ్రాన్ : యుద్ధ సమయంలో ఇరాన్ అనుసరించిన వ్యూహం ఏఐ డేటా కేంద్రాల బలహీనతలను బయటపెట్టింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన సాంకేతికతకు ఊతమిచ్చే డేటా సెంటర్లు యుద్ధంలో లక్ష్యాలుగా మారుతున్నాయి. ఇరాన్ తన పొరుగు దేశాలలోని అనేక డేటా కేంద్రాలపై దాడులు చేయగా అమెరికా సేనలు టెహ్రాన్ డేటా సెంటర్‌పై దాడి చేశాయి. సైబర్ దాడులకు డేటా సెంటర్లు లక్ష్యాలుగా మారడం తెలిసిందే. కానీ భౌతిక దాడులు మాత్రం ఈ ఏడాదిలోనే జరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా సేనలు గల్ఫ్‌లోని కనీసం ఐదు డేటా కేంద్రాలపై దాడులు జరిపాయి. గత నెల చివరలో బహ్‌రైన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ రెండోసారి క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. డేటా సెంటర్లను సైనిక లక్ష్యాలుగా పరిగణిస్తున్నామని యుద్ధ ప్రారంభ సమయంలోనే ఇరాన్ ప్రకటించింది. ఐఆర్‌జీసీ, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, పలాంటిర్ సంస్థలకు చెందిన సైట్లతో పాటు తాము దాడి చేయాలని అనుకున్న 29 ప్రాంతీయ టెక్ లక్ష్యాలను జాబితాను బహిర్గతం చేసింది. ఇరాన్ దాడికి గురైన అమెజాన్ సంస్థకు అనేక అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలోని డేటా సెంటర్లు అమెరికా సేనలకు, ఏఐ పరిశ్రమలకు మాత్రమే కాకుండా అమెరికా, చైనాలతో పాటు గల్ఫ్ ప్రాంతానికి కూడా ముఖ్యమైనవే. సౌదీ అరేబియా తన సార్వభౌమ సంపద నిధిలో గణనీయమైన భాగాన్ని ఏఐకి కేటాయించింది. యూఏఈ ‘స్టార్‌గేట్’ అనే ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. బహ్‌రైన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలు అమెరికాతో పెట్టుబడులకు సంబంధించిన హామీలు ఇచ్చాయి.
సైనిక లక్ష్యాలుగా డేటా కేంద్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



