అంతరాయం లేని విద్యుత్తు అందించడమే లక్ష్యం: డీఈ మధుసూదన్ 

నవతెలంగాణ – నెల్లికుదురు 

ప్రజలకు అంతరాయం లేని విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు డి ఈ మధుసూదన్ తెలిపాడు. శుక్రవారం  మునిగిల వీడు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న విద్యుత్ పోళ్లకు నెంబర్లు వేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొర్రూరు డివిజన్ లో 17 33 కెవి ఫీడర్ ఛానల్ ఉన్నాయని, 31 సబ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. వాటి పరిధిలో ఉన్న విద్యుత్తు పొళ్లకు నంబర్లు వేస్తున్నట్టు తెలిపారు. ఇది ఎన్పీడీసీఎల్ సిఎండి కే వరుణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పొళ్లకు సీరియల్ నెంబర్ వేయడం వల్ల ఎక్కడ విద్యుత్తు పోయిందో అని తొందరగా గుర్తించవచ్చని అన్నారు. ఈ విధంగా గుర్తించడం వల్ల కరెంటును తొందరగా రైతులకు అందించవచ్చు అని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనీ అన్నారు. ప్రజా పలన కార్యక్రమంలో ఎవరికైనా జీరో బిల్లు రాకుండా ఉన్నట్లయితే స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి వారి సంబంధించిన ప్రూఫ్ ల ఆధార్ కార్డు రిసీవ్ టు విద్యుత్తు మీటర్ సంబంధించిన ఐడి నెంబర్ తీసుకెళ్లి నమోదు చేసుకోవచ్చని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే విద్యుత్ పై ప్రజావాణి సోమవారం నిర్వహించే కార్యక్రమానికి మీకు ఏదైనా విద్యుత్ దారులు ఏదైనా సమస్య ఉంటే రాతపూర్వకంగా రాసి విద్యుత్తు మండల ఆఫీసులలో అందించినట్లయితే మీ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో ఎవరు కూడా విద్యుత్తు స్తంభాల వద్దకు వెళ్లి ముట్టుకోకూడదని అన్నారు. మోటార్ల వద్ద ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రజలు వర్షాలు పడ్డప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. విద్యుత్ పై ఏదైనా సమస్య వస్తే స్థానిక విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. రైతులకు ఉండబడినటువంటి మూగజీవాలను ఉదయం పూటనే మేతకు తీసుకువెళ్లి  మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్తుపై ఏ సమస్య వచ్చినా స్థానిక విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప, తెలిసి తెలవక మీరే నిర్ణయం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని అన్నారు. ఏదైనా సమస్య వస్తే స్థానిక విద్యుత్తు అధికారులకు తెలియజేసినట్లయితే ఆ సమస్యను వెంటనే  పరిష్కరిస్తారని అన్నారు. కార్యక్రమంలో నెల్లికుదురు మునగలవేడు సబ్ స్టేషన్ల ఏఈలు సింధు భార్గవి సబ్ ఇంజనీర్ హరీష్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love