తెలంగాణ యూనివర్సిటీ లో కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు గోపిశెట్టి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ ఆన్ యూనియన్, స్టేట్ బడ్జెట్- 2024 పై చర్చ నిర్వహించారు.ఈ చర్చా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్. ఎం.యాదగిరి హాజరై ప్రసంగిస్తూ ఆర్థిక వ్యవస్థను ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాల్లో బడ్జెట్ ప్రధానమైనదని పేర్కొన్నారు.ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు, సామాజిక న్యాయం, ధరల స్థిరత్వం మరియు అంతర్జాతీయ చెల్లింపుల సమతుల్యతలు బడ్జెట్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్, వికసిత్ భారత్ లక్ష్యానికి రోడ్ మ్యాప్ లాగా ఉందన్నారు. పేదలు, యువకులు, మహిళలు, వ్యవసాయ ప్రధానంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండడం స్వాగతించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, ధరల పెరుగుదలను అరికట్టి ఆర్థిక అసమానతులను తగ్గించడానికి ఈ బడ్జెట్లో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను సమీక్షించారు.ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహకంగా సర్టిఫికెట్ తో పాటు వాణిజ్యశాస్త్ర పుస్తకాలను అందించారు.కేంద్ర,రాష్ట్ర, బడ్జెట్ సమీక్షలో ఉత్తమంగా బడ్జెట్ ప్రజెంట్ చేసిన నలుగురు విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నేతలుగా ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ సంపత్ కుమార్, డాక్టర్ ఏ పున్నయ్యలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కే అపర్ణ, ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ డాక్టర్ వి దత్త హరి, డాక్టర్ గంగాధర్ డాక్టర్ జి శ్రీనివాస్ , డాక్టర్ శ్వేత డాక్టర్ పిట్ల సరిత, డాక్టర్ కిరణ్ రాథోడ్, రాజు వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.