గ్యాస్ సిలిండర్ పై డెలివరీ దంద..?

– ట్రాన్స్‌పోర్ట్, సర్వీస్‌ ,చార్జీల పేరుతో ఏజెన్సీల దోపకం..

– సిలిండర్‌పై రూ.30 నుంచి రూ. 40 వరకు అధిక వసూలు..
– జిల్లాలో  2,93,766 గ్యాస్‌ కనెక్షన్లు
– 25 ఏజెన్సీల ద్వారా నెలకు సుమారు రూ.1 లక్ష సిలిండర్ల పంపిణీ
– ఒక సంవత్సరంలో రూ.3.5 కోట్లు వసూల వైనం
– ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు..
నవతెలంగాణ –  సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలోని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వహకులు ప్రజలకు భారంగా అనిపియ్యకుండా ప్రతి సిలిండర్‌పై రూ.30 నుంచి రూ. 40 వరకు అధికంగా వసులు చేస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్‌ రీపిల్లింగ్‌ ఖరీదు రూ.976  ఉండగా ఇందులోనే గ్యాస్ ఏజెన్సీలకు డెలివరీ బాయ్ లకు ప్రభుత్వం ఏజెన్సీల కమీషన్, డెలివరీ చార్జీలు, ప్రభుత్వం అందిస్తున్నది.అయితే ఏజెన్సీలు మాత్రం ప్రతి సిలిండర్‌కు రూ.1,010 నుంచి రూ.1020 వరకు వసులు చేస్తున్నారు.జిల్లాలో ఇండియన్‌ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలకు చెందిన డిస్టిబ్యూటర్లు ప్రజలకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏజెన్సీ నిర్వహకులు దూరంతో సంబంధం లేకుండా అధిక వసుళ్ళకు పాల్పడుతున్నారనేది బహిరంగనే వినిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 2,93,766 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి సుమారు నెలకు 1 లక్ష సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు జిల్లాలో సమాచారం. సరాసరి ప్రతి సిలిండర్‌పై రూ.30 అధికంగా వసులు చేస్తే లక్ష సిలిండర్లకు రూ.1.6 కోట్ల దందా నడుస్తున్నదని సమాచారం.
జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు..జిల్లాలో మూడు కంపెనీలకు చెందిన 13 సాదరణ డిస్టిబ్యూటర్లు, 12 గ్రామీణ విత్రక్‌ డిస్టిబ్యూటర్లు ఉన్నారు. మొత్తం 25 ఏజెన్సీల పరిధిలో 1,66,508 సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు ఉన్నాయి ,50,032 డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్లు ఉన్నాయి, 11,851 దీపం కనెక్షన్లు ఉన్నాయి, 51,359 సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు ఉండగా మొత్తం 2,93,766 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణాలలో ఒక కుటుంబానికి ప్రతి నెలకు ఒక సిలిండర్‌ అవసరం పడుతుండగా గ్రామాలలో ప్రతి మూడు నెలలకు ఒక సిలిండర్‌ వాడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రతి నెల 25 ఏజెన్సీల ద్వారా 1 లక్ష సిలిండర్లు జిల్లాలో సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.
డెలివరి బాయ్స్ కి చార్జీలు చెల్లించాలా.. ఇండియన్‌ ఆయిల్, బీపిసిఎల్, హెచ్‌పిసిఎల్‌ కంపెనీలకు చెందిన డిస్టిబ్యూటర్లు ప్రజల నివాసాలకు దూరంగా గోడౌన్‌లను ఏర్పాటు చేసుకొని సిలిండర్లను సరఫరా చేయాలి. సాదారణ డిస్టిబ్యూటర్లు తమ గొడౌన్‌ పరిధిలో చుట్టు 5 కిలో మీటర్ల దూరం వరకు సిలిండర్‌ ఖరిదుపై అధికంగా వసులు చేయకుండా అందించాల్సి ఉంది. గోదామ్‌ వద్దకు లబ్దిదారులు వెళ్లి సిలిండర్‌ తీసుకున్నట్లయితే ఖరీదుపై రూ. 12 లబ్దిదారునికి తగ్గించి అందించాలి అని జీవోలో చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 0 నుంచి 15 కిలో మీటర్లలోపు సిలిండర్ పంపిణీకి ఎలాంటి అధిక ఖరిదు చెల్లిచవలసిన అవసరం లేదు. అదే విదంగా 16 కిలో మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు సిలిండర్‌ సరఫర చేస్తే రూ. 10, 30 కిలోమీటర్ల కంటే అధిక దూరం సరఫర చేస్తే రూ. 15 మాత్రమే అధికంగా తీసుకోవాలి. ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు ఖరీదులోనే డెలివరి చార్జీలు, ఏజెన్సీ కమీషన్, లబ్దిదారునికి అందించే సబ్సీడీ అన్ని కలిపి ప్రతి నెల ఖరీదును నిర్ణయిస్తుంది. ఏజెన్సీ నిర్వహకులు డెలివరి బాయ్స్‌కి జీతాలు అందజేస్తారు. తప్ప ప్రజలనుంచి కమీషన్‌ వసూలు చేయడానికి వీలు లేదు.అయితే జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు మాత్రం వారికి ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు.
సిలిండర్ ధరపై అధిక వసుళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు..జిల్లా పౌరసరపాలక శాఖ అధికారి మోహన్‌బాబు..
గ్యాస్‌ సిలిండర్‌పై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసులు చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై కఠినమైన చర్యలు ఉంటాయి. గతంలో వచ్చిన ఫిర్యాదుల పై గ్యాస్ ఏజెన్సీల నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించాము.అయినా వాళ్లు వినకుండా అధిక వసుళ్ళు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేపట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Spread the love