లోటస్‌పాండ్‌లోని జగన్‌ ఇంటి వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్‌ నివాసం(లోటస్‌ పాండ్‌) వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. గతంలో జగన్‌ భద్రత కోసం లోటస్‌పాండ్‌ వద్ద సెక్యూరిటీ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ పలువురి నుంచి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం పోలీస్‌ బందోబస్తు మధ్య జగన్‌ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు.

Spread the love