– ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణ జనాభాకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అమృత్ 2.0 లో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డులోని బాలానగర్ లో రూ. 14 కోట్ల నిధులతో నీటి సరఫరా పథకానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలకు త్రాగు నీటి వసతి కల్పించేందుకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సాగు,త్రాగు నీరు,విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా 2005 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1731 కోట్ల తో ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇక్కడ ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ బింగి మహేష్, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పుల్కం రాజు, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.