కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య

– మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య  అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట, ప్రజా పరిషత్ కార్యాలయల్లో సర్వ సభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య  మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందజేశామని, సీఎం రేవంత్ రెడ్డి మాట మేరకు ఆగస్టు 15వ తేది వరకు రుణమాఫీ అవుతుందని జులై 15వ తారీకు మొదటి విడత, జూలై 20 తారీకు రెండో విడత, జూలై 30 వ తారీకు మూడో విడతగా, 2లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పిటిసి తోటకూర అనురాధ బీరయ్య, ఎంపిటిసిలు కర్రె విజయ వీరయ్య, ఎడ్ల సుగుణమ్మ రామ్ రెడ్డి, కొక్కలకొండ అరుణ, ఎంపీడీవో కోట నవీన్ కుమార్ ప్రజా ప్రతినిధులు, అన్నిశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love