నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గ్రామాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందని తంగళ్ళపల్లి జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి కేటాయించిన ఎస్డిఎఫ్ నిధుల నుండి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి శుక్రవారం అభివృద్ధి పనులకు భూమి పూజలు,శంకుస్థాపనలు చేశారు. మండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో త్రాగునీటి ఎద్దడి తీర్చేందుకు కమ్యూనిటీ భవనం వద్ద బోరు మోటర్ ను ప్రారంభించారు. నేరెళ్ల, జిల్లెల్ల, నరసింహుల పల్లె గ్రామల్లో బోరు మోటార్లను ప్రారంభించారు. రామచంద్రపురం గ్రామంలో రెడ్డి సంఘం భవన నిర్మాణానికి, హై మార్క్స్ లైట్లు ఏర్పాటుకు, నరసింహులపల్లి లొ సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.