ఒకవైపు అభివృద్ధి, మరో వైపు ప్రజా సంక్షేమం.. 

– 208 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ 
ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి,అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ రూరల్, అర్బన్ మండలాల అర్హులైన 208 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై చెక్కులను మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి తో కలసి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడ్ వల్ల కాస్త ఆలస్యమైందని అన్నారు. ప్రభుత్వం సామాజిక బాధ్యతగా నిరుపేద బిడ్డలకు వివాహం జరిగినప్పుడు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా కళ్యాణ లక్ష్మి తోడ్పాటునందిస్తాయన్నారు. సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు. మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇండ్లు లేని వారికి త్వరలోనే వాటి నిర్మాణానికి బీసీలకు ఐదు లక్షలు ఇతరులకు ఆరు లక్షల ఇవ్వడం జరుగుతుందన్నారు. వేములవాడ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు కాబడి ఉన్నాయన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమాన్ని రెండు కండ్లుగా ప్రభుత్వం చూస్తుందని అన్నారు.  ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య,రూరల్ మండలాధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పుల్కం రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love