మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

Dharna in front of the municipal officeనవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని 36 వార్డులలో స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని గురువారం సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. పట్టణంలో కోతుల బెడద బాగా ఉంది అని రాత్రిపూట కుక్కలు వీధులలో తిరుగుతున్నాయి. చిన్న పిల్లలను సైతం కరుస్తున్నాయని అన్నారు. వాటిని నివారించాలని, 1300 ప్లాట్ లలో డ్రైనేజీ సరిగా లేదని రోడ్లు సరిగా లేవని, రాంనగర్ కాలనీలలో డ్రైనేజీ సరిగా లేక నీళ్లన్నీ ఆగిపోతున్నాయని అన్నారు. టీచర్స్ కాలనీ నుండి రాజారాం నగర్ పోయే డిపెండెన్స్ స్కూలు వెనకాల ఉన్న రోడ్డు మొత్తం కొట్టుకుపోయి వాహనాలు వెళ్ళ లేని పరిస్థితి వుంది. దాన్ని వెంటనే బ్లేడు బండితో సరి చేయాలని రజరము నగర్ స్మశాన వాటికకు రోడ్డు చేయాలని అన్నారు. యానం గుట్ట సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఎన్ని సంవత్సరాలుగా నిరుపేదలు అక్కడే నివాసముంటున్నప్పటికిని, పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేయడం లేదని రాత్రిపూట పాములు తేళ్లు వస్తున్నాయని వెంటనే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఖాళీగా ఉన్న స్థలాలకు ఐదు లక్షలు లోను ఇస్తామని ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది ఇప్పటికీ ప్రారంభించలేదు. వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వాడు లేని వారందరికీ రేషన్ కార్డు ఉగాదికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటికీ రేషన్ కార్డు ఇవ్వలేదు ఎంపికైన లబ్ధిదారులకు రేషన్ కార్డు వెంటనే ఇచ్చి సన్న బియ్యం కూడా వారికి అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కూతాడు ఎల్లయ్య, నాయకులు బొర్రా నాగరాజు సుజాత, నవీద్ భాయ్, లాల్య నాయక్, రఫీ ఖాన్, శర్మ, రజియా సుల్తానా, రసీదా బేగం మౌలానా తదితరులు పాల్గొన్నారు.

Spread the love