
యువతకు స్ఫూర్తి ప్రదాత,చైతన్య మూర్తి,దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహామనిషి స్వామి వివేకానంద అని డీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధుశ్యంత్ రెడ్డి అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేసి ఆ మహనీయనికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆదివారం రోజున “జాతీయ యువజన దినోత్సవం” సందర్భంగా యువతకు శుభాకాంక్షలు. స్వామి వివేకానంద భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని ఆయన యువతకు ఇచ్చిన మార్గదర్శకాలు సందేశాలను నేటికీ ఆదర్శంగా తీసుకుని పాటిస్తున్నారు అని అన్నారు. విగ్రహ ధాతగా బీజేపీ వెంకటయ్య, కార్యక్రమానికి పలువురు ప్రముఖులు నేతలు ఆర్థిక సహాయం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.