శిధిలమవుతున్న వసతి గృహాలు..

– చదవలేకపోతున్న విద్యార్థులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
వసతి గృహాలు శిథిలావస్థకు చేరుతుండడంలో విద్యార్థులు చదవలేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పల్లెపు విజయ్ అన్నారు. ఆదివారం  భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు వసతి గృహాల పనితీరు పై సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఎస్టీ వసతి గృహం  అపరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. హాస్టల్ బిల్డింగ్ శిథిల వ్యవస్థ చేరింది వర్షం పడటం వలన బిల్డింగ్ పేచ్చులు పెచ్చులు  పగిలి విద్యార్థుల పైన పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రెగ్యులర్ వార్డెన్ నియమించాలన్నారు. నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా కాంపౌండ్ వాల్ లేక హాస్టల్ గదిలలోకి విష పురుగులు వస్తున్నాయన్నారు. దానితోపాటు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫ్యాన్లు లేక దోమల తీవ్రంగా కుడుతున్నాయన్నారు.  ఇలా ఉంటే మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. హాస్టల్ గ్రౌండ్లో  నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువగా కుట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యుత్తు వైరింగ్ దెబ్బతిందని ఏ సమయంలోనైనా విద్యార్థులకు విద్యుత్ తో ప్రమాదం పొంచి ఉందని అన్నారు. వెంటనే  పేద మధ్యతరగతి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాకేష్, శివ, అశోక్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love