గాంధారి మండలంలోని సోమారం తండాకు చెందిన జన్నుబాయి అనే రైతుకు ఫారెస్ట్ భూమి కంపార్ట్మెంట్ 754 నందు మూడు ఎకరాల ఫారెస్ట్ పట్టా భూమి కలదు. ఇట్టి భూమిని అటవీ అధికారులు కూడా ధ్రువీకరించినారు. గత 20 రోజుల క్రితం ఈ భూమి లో మొక్కజొన్నలు వేయగా, నిన్న అర్ధరాత్రి సమయంలో కొత్త బాది తండాకు చెందిన 50 నుండి 60 మంది కలిసి 5 నుండి 6 ట్రాక్టర్లతో అట్టి భూమి మొత్తం మాదే అని దౌర్జన్యంగా అర్ధరాత్రి సమయంలో దున్ని పూర్తిగా పంట నష్టం చేసినారు. జన్ను బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.