కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ -ఆర్మూర్
మండలంలోని ఖానాపూర్ గ్రామంలో మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కును  లబ్ధిదయారులు సుద్దపల్లి పోసాని కి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా  సర్పంచ్ సింగిరెడ్డీ మోహన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి హయాంలో ప్రతి గ్రామ గ్రామంలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో. యూత్ అధ్యక్షుడు డా,నరేందర్  ,సంతోష్, ప్రభాకార్, మోహన్ ,శ్రీను,రాజనర్సయ్యా బి ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు .
మిర్తాపల్లి గ్రామంలో
మండలంలోని మిర్ధపల్లి గ్రామంలో  భారాస జిల్లా అధ్యక్షులు పియుసి చైర్మైన్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మంజూరు చేయించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ సౌడ మధువర్మ మంగళవారం లబ్ధిదారుల కు అందజేసినారు.  ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ గడ్డం గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహా రెడ్డి, గంగారెడ్డి, సజిత్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love