మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల బంజరఎల్లాపూర్, పంభాపూర్ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచితంగా టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ చేశారు. గోవిందరావుపేట మండలానికి చెందిన కీర్తిశేషులు వీరపనేని రామదాసు, వెంకటసుబ్బమ్మ గార్ల జ్ఞాపకార్ధం విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యాబోధన చేస్తుండగా వారికి తమ వంతుగా నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నట్లు దాతలు తెలిపారు. అనంతరం తాడ్వాయి మండల టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సుతారి పాపారావు, గోవిందరావుపేట టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షులు వంగ పాపయ్య లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాప హనుమంతు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.