
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథోత్సవం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మెట్ల మార్గంలో భక్తులకు పులిహోర, స్వీటు ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ నేను చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం నా యొక్క పూర్వజన్మ సుకృతం అని కార్యక్రమానికి హాజరై నాకు సహకరించిన తోటి ఆర్యవైశ్య నాయకులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి యాదగిరిగుట్ట మండల పట్టణ ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు కోకల రవీందర్ , బెజగం శివకుమార్, అయిత వెంకటేశ్వర్లు, ఉప్పల సిద్ధి లింగం, ఉప్పల రమేష్ గుప్తా, లెన్కలపల్లి శ్రీనివాస్, సముద్రాల వేణు, పంతంగి శేఖర్, ఉప్పగల్ల నరసింహులు, పోకల లక్ష్మీనారాయణ, ఉప్పుగల శీను, పోకల నాగరాజు, తోట సత్యనారాయణ, కూరెల్లి రమేష్, పోకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.