
వేములవాడ రాజన్న ఆలయంలో ఎండనకా, వాసనక వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్.పీ. ఎఫ్, హోమ్ గార్డ్స్ సిబ్బందికి మై వేములవాడ ట్రస్టు సభ్యులు నగుబోతు రవీందర్ అందించిన గొడుగులు మంగళవారం రాజన్న ఆలయ కార్యనిర్వాహణాధికారి ఓ.వినోద్ రెడ్డి, దేవస్థానం సిబ్బంది చే పలువురు ఎస్.పీ.ఎఫ్ సిబ్బందికి, హోమ్ గార్డ్స్ లకు గొడుగుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మై వేములవాడ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, దేవాలయ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.