– యాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట
– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
యాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్ర వారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల చేత అక్షరాభ్యాసం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కొప్పు సుకన్య భాష హాజరై విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి విద్యా ర్థికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్ అందేలా చూడాలని ఎంపీపీ ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆమె తెలిపారు. పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న సౌక ర్యాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని ముం దుకు సాగాలని ఎంపీపీ కోరారు. కార్యక్రమంలో ఎంపీడీ వో నరేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.