నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని కులస్పూర్ గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పది నెలల పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు విటమిన్ ఏ మందుని పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ రజిత మాట్లాడుతూ చిన్నపిల్లల్లో విటమిన్ లోపాలను సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కచ్చితంగా 10 నెలల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ ఈ మందును తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం ఈనెల 12 నుంచి 20 వరకు ఉంటుందని గ్రామంలోని చిన్న పిల్లలందరి తల్లిదండ్రులు దీని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.