- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ పథకంలో మంజూరై, నిర్మాణాలను పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశాలు నిర్వహించామని అన్నారు. అదేవిధంగా లబ్దిదారులకు చిరు కానుకగా గోడగడియారాలను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్థాయి అధికారులను ఆహ్వానించి, గ్రామస్తుల సమక్షంలో వారిని ఘనంగా సన్మానించామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జీపీ కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



