జిల్లా బహుజన ఉపాధ్యాయ నూతన సంఘం ఎంపిక

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా బహుజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా గాజుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా అవుట చెన్నయ్య ను మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సిద్ధార్థ మహదేవ్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లా బహుజన ఉపాధ్యాయ సంఘం (BTA) కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ శాగంటి మల్లేష్, కార్యనిర్వాక అధ్యక్షులు గాజుల బాలరాజు, కోశాధికారి ఎల్లికంటి కరుణాకర్, ఉపాధ్యక్షులు నారుమోళ్ళ రవిందర్,సంయుక్త కార్యదర్శి ఇమ్మడి వెంకటేష్,సాంస్కృతిక మరియు ప్రచార కార్యదర్శి మూడవత్ రాజు,కార్యదర్శులు కుందేటి వసంత్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ మా పైన ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సిద్ధార్థ మహదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అందరం కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టి,  మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల కొరతను తీర్చాలన్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు మొక్కురాల శ్రీనివాసులు, కుంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love