రాష్ట్రస్థాయికి ఎంపికైన జిల్లా సైక్లిస్ట్ లు..

District cyclists selected for the state level.నవతెలంగాణ –  సిద్ధిపేట 
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి లో ఈనెల ఐదు నుండి 7 వరకు జరిగే రాష్ట్రస్థాయి పాఠశాలల  క్రీడా సమాఖ్య అండర్ 14, 17 బాల బాలికల సైకిలింగ్ పోటీలకు ఉమ్మడి మెదక్  జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు పాఠశాల క్రీడా సమాఖ్య అధ్యక్ష ,కార్యదర్శులు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఏ.సౌందర్య లు  తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపికైన వారిలో బాలికల విభాగం నుండి రిజ్వాన, అంకిత, లిఖిత, వర్షిత, శీలం శ్రీనిధి, మద్దెల సంజన, జంగపల్లి రేణుక, సాయి ప్రసన్న,  బాలుర విభాగం నుండి నీలం జస్వంత్, బళ్ళు నిఖిల్, బి ప్రసాద్, జి చరణ్, ఆవన్ రెడ్డి లు ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జoగపల్లి వెంకట నరసయ్య , సీనియర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కాటo శ్రీనివాస్, పత్తి రవి, బి.రమ, ఓం ప్రకాష్ రెడ్డి, ఖేలో ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love