Magazines

మల్లేష్‌ యాదవ్‌ కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సాయం

2 గంటల క్రితం

financial assistance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్‌

ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ సర్పంచ్‌ కీర్తిశేషులు చిరబోయిన మల్లేష్‌ యాదవ్‌ కుటుంబానికి ఆయన చిన్ననాటి మిత్రులు ఆర్థిక సాయం అందించారు.ముందుగా మల్లేష్‌ యాదవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా 1981–82 బ్యాచ్‌కు చెందిన చిన్ననాటి మిత్రులు కాయితీ జగదీశ్వర్‌రెడ్డి, వగ్గు మురళీకృష్ణ మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న తమ మిత్రుడు మల్లేష్‌ యాదవ్‌ ప్రజా సేవలో ప్రత్యేక ముద్ర వేశారని గుర్తుచేశారు.


సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో పేదలు,సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ఆయన సేవలు గ్రామస్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. మిత్రుడిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబానికి తమకు తోచినంత ఆర్థిక సాయం అందించామని తెలిపారు. భవిష్యత్తులోనూ మల్లేష్‌ యాదవ్‌ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పగుడాల రాజేశ్వరరావు,కల్లూరి ప్రభాకర్‌రెడ్డి,ఆకుల వెంకటేశ్వరరావు,రమాదేవి,అన్నపూర్ణ, ఉషారాణి,కేతోజ్‌ నరేందర్‌చారి,ఆకుల చంద్రశేఖర్‌, వగ్గు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్