Magazines

జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ పోటీలకు 10 మంది బాలికల ఎంపిక

5 రోజుల క్రితం

selected
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాడెట్ బాలికల విభాగం నుంచి పది మంది స్కేటర్లను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. 64వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు డిసెంబర్ 5 నుంచి 15 వరకు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించనున్నారు. roller skating


ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికైన బాలికల వివరాలను తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రకటించింది. ఎంపికైన వారిలో మోడ్ మహన్య, ఎం. జునైటా ప్రియాంక, అల్లా నైరా, నజీహా రుహీన్, అలీజా అజర్, జైనబ్ ఫాతిమా, ధృతి రామిశెట్టి, హయత్ అజర్, కేతిరెడ్డి దక్ష, పెద్ది రెడ్డి ధీవ్యాంశి ఉన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్న బాలికలు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్