Magazines

పల్లె క్రికెట్‌కు ప్రొఫెషనల్‌ టచ్‌.. పరకాలలో మెగా వేలం టోర్నీ!

16 గంటల క్రితం

Parakala

Parakala

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- ఐపీఎల్‌ తరహాలో ఆటగాళ్ల ఎంపిక.. నేడు మెగా ఆక్షన్‌ ప్రారంభం

నవతెలంగాణ – పరకాల: గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో పరకాలలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ సీజన్‌-1 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపీఎల్‌ తరహాలో ఆటగాళ్లను వేలం ద్వారా జట్లలోకి ఎంపిక చేసి పోటీలు నిర్వహించనున్నారు. మెగా ప్లేయర్స్‌ ఆక్షన్‌ను నేడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించనున్నారు. టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీకి పోచంపల్లి ట్రస్ట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ పోటీల్లో పరకాల, రేగొండ, నడికూడ, శాయంపేట మండలాల క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నారు. అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 10 వరకు రిజిస్ట్రేషన్లు చేపట్టగా, తొలి విడతలో 150 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నారు. ఒక్కొక్కరు రూ.200 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టోర్నమెంట్‌లో విజేత జట్టుకు రూ.50 వేలు, రన్నరప్‌ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి అందించనున్నారు. క్రికెట్‌పై ఆసక్తి, ప్రతిభ ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇతర వివరాలకు 9502091797, 9676345258 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్