ప్రజా ట్రస్ట్ చేర్మెన్ మోహన్ రావు పటేల్
నవతెలంగాణ-కుభీర్
పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని ప్రజా ట్రస్ట్ చెర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. గురువారం మండలంలోని పార్డి (బి )లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రయివేట్ పాఠశాల ఎల్బిఎంలో చదువుకునే పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా యువతీ యువకులకు ప్రజా ట్రస్ట్ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభించామని తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ్ రెడ్డి,వెంకటేష్, మనోజ్ కుమార్ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.







కామెంట్‌లు (0)