Magazines

గవర్నర్ కోట ఎమ్మెల్సీలో బీసీ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి

6 గంటల క్రితం

d
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

- జాతీయ బీసీ సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరు సమ్మయ్య నాయి

నవతెలంగాణ-మల్హర్ రావు : గవర్నర్ కోట ఎమ్మెల్సీలో బీసీలకు అవకాశం కల్పించాలని జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరీ సమ్మయ్య నాయి డిమాండ్ చేశారు.సోమవారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి బీసీ  సంఘాలు,బీసీ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారని,బీసీలు శ్రీకాంత్ చారి,కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్,రంగయ్య నాయీ చాలామంది ప్రాణం త్యాగం చేశారని తెలిపారు.బీసీ సంఘం నాయకులు గ్రామస్థాయి నుండి ఉద్యమం చేశారని,తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ఇప్పటివరకు సామాజిక న్యాయం  జరగలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వచ్చినంక  తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక కమిటీ వేశారని,హామీని కూడా అమలు చేయాలన్నారు.సీఎం రేవంత్ అసెంబ్లీలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ చట్టం చేశారమన్నారు.అదేవిధంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంఘాల బీసీ ఉద్యమకారుల గుర్తించి చట్టసభలో లేని బీసీ కులాలను గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం కల్పించాలన్నారు.సామాజిక న్యాయం,సామాజిక తెలంగాణ,బీసీల పట్ల సామాజిక న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్