నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని పాత రుద్రారంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్టాన కార్యక్రమాన్ని సోమవారం అంగరంగవైభవంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి ఇదే గ్రామానికి చెందిన భోగే మల్లయ్య-లత దంపతులు రూ.1.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇందుకు ఆలయ నిర్వాహకులు,గ్రామస్తులు మల్లయ్య దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పాత రుద్రారం గ్రామ అభయ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణంలో సింహభాగమైన స్లాబ్ నిర్మాణానికి 1 లక్ష 50 వేలు విరాళం అందజేయంతో దంపతులకు శాలువాతో ఘనంగా సత్కరించారు.







కామెంట్‌లు (0)