Magazines

ఇప్పలపల్లి గ్రామానికి సిసి రోడ్డు మంజూరు చేయాలి..

6 గంటల క్రితం

malhar rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

- కాటారం సబ్ కలెక్టర్ కు..ప్రజా సంఘాల నాయకుడు వినతి

నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి సిసి రోడ్డును మంజూరు చేయాలని కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మకు సోమవారం ప్రజావాణిలో ప్రజా సంఘాల నాయకుడు అక్కల బాపు యాదవ్ విన్నవించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డుకు అక్కల సురేష్ ఇంటి వద్ద నుండి అక్కల చిన్న బాపు యాదవ్ ఇంటి వరకు గత 20 సంవత్సరాల నుండి సీసీ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ,అవస్థల పాలవుతున్నారని తెలిపారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ వార్డులో  రోడ్డుతోపాటు కనీస మౌలిక ప్రజా అవసరమైన సిసి రోడ్డు వేయలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల అవసరాల రీత్యా సిసి రోడ్డును మంజూరు చేసి మా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని గ్రామ ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్