Magazines

జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

1 రోజు క్రితం

Children's Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ఆర్మూర్

పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ వివిధ రకాల ఆటలు మరియు పోటీ క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు బాలల దినోత్సవం గురించి చక్కగా ప్రసంగాలు ఇచ్చారు. నృత్య ప్రదర్శనలు చేస్తూ సరదాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గుజరాతి ప్రకాష్ ,పరిపాలన అధికారి లత , ప్రిన్సిపల్ కర్తన్ రవికుమార్  ఉపాధ్యాయ బృందం పాల్గొని. ప్రతి సంవత్సరం నవంబర్ 14న తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామని , మన దేశ తొలి ప్రధానమంత్రి అయినా పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటామని తెలిపారు. పిల్లలు దేశ భవిష్యత్తుకు ఆశాకిరణాలు వారిలో ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని వివరిస్తూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్