జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కార్యదర్శులుగా క్రిస్టఫర్, కుమారస్వామి 

5 గంటల క్రితం

consumer associations
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

యాదాద్రి భువనగిరి జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ సమావేశం  భువనగిరి పట్టణంలో శనివారం ఎస్ వి హోటల్లో  గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అంజాత్ అలీ , అధ్యక్షులు , కొలను శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జంపాల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించాగ, జిల్లాఅధ్యక్షులుగా  కందుల శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు కుకుటాపు చంద్రశేఖర్ సమక్షంలో ఆలేరు పట్టణానికి చెందిన  ఒగ్గు క్రిస్టఫర్, యేలగల కుమారస్వామి కార్యదర్శులుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొద్దుటూరు మల్లికార్జున్, 

 ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వంగపల్లి అంజయ్య ఎన్నికయ్యారు.


 ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలో ఆదివారం  మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు , ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, జిల్లాలోని అన్ని శాఖల  అధికారులను సమన్వయం చేసుకుంటూ  వినియోగదారులకు సేవలు అందిస్తామన్నారు.

 మాపై నమ్మకం నుంచి ఈ బాధ్యతలు కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో  వినియోగదారుల సంఘం   సభ్యులు బొమ్మ కంటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్