Magazines

వర్ధన్నపేటలో సీఎం జన్మదిన వేడుకలు 

1 రోజు క్రితం

CM's birthday celebrations in Wardhannapet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

- కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ - వర్ధన్నపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచి పెట్టారు. అంబేద్కర్ సెంటర్ వద్ద జన్మదిన వేడుకలతో పాటు బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు పోషాల వెంకన్న, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు దేవస్థానం చెర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర ఎస్. సి సెల్ ఉపాధ్యక్షులు తుళ్ళ రవి, వర్ధన్నపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ లు పార్టీ నాయకులు ఎండి అప్సర్, కొండేటి బాలకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్