Magazines

కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌కు పరామర్శ

31 నిమిషాల క్రితం

Consultation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు ​

మండలంలోని రత్తిరాంతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ కు ఇటీవల పితృవియోగం జరిగింది. దీంతో వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రత్తి రారాం చేరుకొని స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాలాజీ నాయక్ ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోటి మీది తండా సర్పంచి రామ్ సింగ్ నాయక్, సీతారామపురం సర్పంచి ధారావతు భాస్కర్ నాయక్, నల్లగుట్ట తండా సర్పంచి హేమలత శ్రీను, దుర్గా భవాని తండా సర్పంచి వీరన్న నాయక్,రాజ్య తండా సర్పంచి ధారావతు విజయ ఆనంద్,జాటోతు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

వేరువేరుగా ​అలాగే డీసీసీ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ తండ్రి మృతి చెందడంతో ఆయన  చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులర్పించారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల శంకర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ పెరుమాండ్ల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి ప్రవీణ్ రెడ్డి, తాళ్ల సతీష్, బొల్లు లింగమూర్తి, చెన్నబోయిన శ్రీనివాస్, జెల్ల ఉపేందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్