Magazines

బేతుపల్లిలో ‘మురసు’ తుఫాను బీభత్సం

1 గంట క్రితం

rain effect
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- నేలకొరిగిన భారీ వృక్షాలు 

- పశువుల కొట్టం కూలి చూడి గేదెకు తీవ్ర గాయాలు 

- నీట మునిగిన వరి పొలాలు 

నవతెలంగాణ-సత్తుపల్లి : ​సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ‘మురసు’ తుఫాను తీవ్ర అలజడి సృష్టించింది. ​ఈదురు గాలుల ధాటికి గ్రామంలోని ఎస్సీ కాలనీ, పటం బజార్ లోని ఏళ్లనాటి పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. చేతికందే దశలో ఉన్న వరి పంట చేలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దొడ్డా వెంకటేశ్వరరావుకు చెందిన పశువుల కొట్టం తుఫాను ధాటికి కూలిపోయింది. కొట్టం దూలం చూడిగేదె నడుముపై పడడంతో తీవ్రంగా గాయపడిన గేదె  లేవలేని స్థితిలోకి చేరింది. ​గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ​ఆయన గ్రామ కార్యదర్శి ఆదినారాయణ, వీఆర్వో నాగేశ్వరరావులతో కలసి నష్టాన్ని పరిశీలించారు. ​పటం బజార్, ఎస్సీ కాలనీ రోడ్లపై విరిగిపడిన చెట్లను సిబ్బందితో తొలగించి దారి సుగమం చేశారు. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. బాధితులు, దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్