నవతెలంగాణ-మల్హర్ రావు
డిసెంబర్ 5న చలో వరంగల్ దళితుల సమరభేరిని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్-టి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం తాడిచెర్లలో ‘దళితుల సమరభేరి’ ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళితుల హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్-టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్‌లోని కాస్మి కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లుగా తెలిపారు.
దళిత జాతిని ఐక్యతను చాటిచెప్పే ఈ సభను సంబడ వర్ణం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టి జిల్లా అధ్యక్షుడు బూడిద సమ్మయ్య,మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల రాజ్ కుమార్, కొలుగురు సంపత్, శ్రావణ్, బూడిది మల్లేష్, కే.సారపు రాజయ్య, రాకేష్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)