- కేసప్పగూడెం కే.సీ.ఆర్ కాలనీలో పర్యటించిన బీఆర్ఎస్ మహిళా నేతలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. మండలంలోని కేసప్పగూడెం గ్రామం కే.సీ.ఆర్ కాలనీలో గురువారం పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
వరదల కారణంగా కాలనీలోని ఇళ్లన్నీ నీటమునగడంతో నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు దెబ్బతిన్నాయని బాధితులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 25 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని చంద్రమోహన్–పద్మ, డా. భూక్యా ప్రసాద్–డా. ఉదయజ్యోతి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. వరద బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, కష్టకాలంలో అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కేసప్పగూడెం సర్పంచ్ సోడెం భారతి, వార్డు సభ్యులు కొవ్వసి భారతి, సోయం వెంకటమ్మ, సున్నం పార్వతి, వేదాంతాపురం సర్పంచ్ సోడెం ముత్యాలరావు, పిల్లెం బొత్తయ్య, సొంధెం ముత్యాలరావు, సొంధెం కృష్ణ, వేదాంతాపురం మాజీ సర్పంచ్ సోమిని శివశంకర్ ప్రసాద్, అశ్వారావుపేట టౌన్ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, గూడవర్తి వెంకటేశ్వరరావు, జజ్జురపు శ్రీరామమూర్తి, తగరం జగన్నాథం, శెట్టిపల్లి రఘురామ్, జక్కం బలరామకృష్ణ, రాజనాల గంగాధర్, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)