- 70వ ఎస్ జీ ఎఫ్ జిల్లా స్థాయి ఖోఖో ఛాంపియన్షిప్
- 2026కు ఏర్పాట్లు పూర్తి
- మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి జ్ఞాపకార్థం పోటీలు..
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ - యాలాల్ : యాలాల మండలం కేంద్రంలో 70వ ఎస్ జీ ఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ) జిల్లా స్థాయి ఖో ఖో ఛాంపియన్షిప్ 2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నవంబర్ 5న స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరగనున్నాయి. మాజీ సర్పంచ్ నారా యణరెడ్డి జ్ఞాపకార్థం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఈ ఛాంపియన్షిప్లో వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకోనున్నారు.






కామెంట్‌లు (0)