నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం గాడ్రాల క్రాస్ రోడ్ లోని శివాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు హాజరై విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొద్దిసేపు తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకంపల్లి వీరభద్రరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)