నవతెలంగాణ-మిడ్జిల్
శివాలయంలో విగ్రహాల చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు మండల పరిధిలోని మున్ననూరు శివాలయ గర్భగుడిలోకి చొరబడి విగ్రహాలతో పాటు, ప్రతిష్ఠాత్మకమైన నాగపడిగె, త్రిశూలాన్ని ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం పరమేశ్వరుడిన్ని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. నిందితల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.







కామెంట్‌లు (0)