Magazines

ఫార్డి(బి)లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం

4 రోజుల క్రితం

Registration Begins
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఫార్డి (బి )గ్రామంలో శుక్రవారం మండల ఎంపీడీఓ భూమరావు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ఎలాంటి తప్పులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.


ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదు చేసేటప్పుడు సభ్యుని పేరుతో పాటు నామిని వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇబ్బందులు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ పథకం గ్రామల్లో ఉన్న ప్రజలకు అవగహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ భూమరావు, పంచాయతీ కార్యదర్శి, ఐకేపి సిబ్బంది తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్