- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి
- సిద్ధారంలో మహాసభల ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
నల్గొండ పట్టణంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను రైతులు, ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి పిలుపునిచ్చారు. మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మహాసభలు విజయవంతం కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ... రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ జాతీయ మహాసభలను జయప్రదం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత, రుణమాఫీ తదితర సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ మహాసభలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, ఎలగం రాములు, తోటకూర నారాయణమ్మ, రేసు లక్ష్మి, రాయిని తిరుపతమ్మ, జయమ్మ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.







కామెంట్లు (0)