నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీహరిహరాత్మజ అయ్యప్ప స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే పడిపూజ కార్యక్రమ నిర్వహణ కోసం టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు రూ. 50 వేలు విరాళాన్ని ఆ ఆలయ కమిటీ బాధ్యులకు అందజేశారు. శుక్రవారం ఆలయ దర్శనానికి వచ్చిన విజయబాబు అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజ జరిపించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం పైన తెలిపిన విరాళాన్ని ఆలయం కమిటీ బాధ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులు విజయబాబును సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దోసపాటి అమరలింగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు మల్లికార్జునశర్మ, ఉపాధ్యక్షులు దురిశెట్టి శ్రీనివాసరావు, సెక్రెటరీ బొంతు శ్రీనివాసరావు, వడ్డపట్ల ఫణి కుమార్, వెదుళ్ల నాగు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)