Magazines

మలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలు

18 అక్టోబర్, 2026

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో అంగరంగ వైభవంగా మలేషియా వేదికగా ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ప్రముఖుల హాజరు

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ రాజేష్ హెచ్. మణియిల్, ఫస్ట్ సెక్రటరీ (కాన్సులర్, పాస్‌పోర్ట్ & వీసా), భారత హైకమిషన్, కౌలాలంపూర్ హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ప్రముఖ జానపద నృత్య కళాకారిణి జనుల్యూరి, ప్రముఖ జానపద గేయ రచయిత, గాయకుడు దిలీప్ దేవ్‌గన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరుణ్ కొలుగూరి పాల్గొని తమ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.


మలేషియాలోని వివిధ ఇండియన్ అసోసియేషన్ల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరై తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించారు. వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ తెలంగాణ వంటకాలు, ఆహార సంస్కృతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సందర్శకులు తెలంగాణ రుచులను ఆస్వాదించేలా ప్రత్యేక ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.


ఈ క్రమంలో 13వ బతుకమ్మ వేడుకల విజయవంతమైన నిర్వహణకు స్పాన్సర్లు GRPC Malaysia Sdn Bhd, Rapinno Tech Sdn Bhd, సంస్థలు స్పాన్సర్‌గా అందించిన సహకారం ఎంతో కీలకంగా నిలిచింది. & MY81 హైదరాబాద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ ఫుడ్ స్పాన్సర్‌గా వ్యవహరించి కార్యక్రమానికి ప్రత్యేక సహకారం అందించింది.


స్పాన్సర్లకు, ముఖ్య అతిథులకు, ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధులకు, కళాకారులకు, వాలంటీర్లకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మలేషియా తెలంగాణ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సైదం తిరుపతి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.


తెలంగాణ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను మలేషియాలో కొనసాగిస్తూ, భవిష్యత్ తరాలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడమే తమ లక్ష్యమని MYTA ప్రతినిధులు తెలిపారు. “మన బతుకమ్మ – మన సంస్కృతి – మన తెలంగాణ- One మైటా” అనే సందేశంతో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్