నవతెలంగాణ - అశ్వారావుపేట
ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మెర రామమూర్తి ఆదివారం అశ్వారావుపేట పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ తండ్రి, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కాసాని వెంకటేశ్వరరావును ఆయన నివాసంలో ఆత్మీయంగా కలుసుకుని పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)